
కౌశల్ మంద అంటే తెలియని వాళ్ళు లేరు. బిగ్ బాస్ సీజన్ 2 ని కౌశల్ ఆర్మీ పేరుతో ఒక ఊపు ఊపింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 మొదలవడంతో కౌశల్ బిగ్ బాస్ గురించి ఇంటరెస్టింగ్ విషయాలను ఇంటర్వ్యూస్ లో చెప్తూ వస్తున్నాడు. రీసెంట్ గా కూడా ఒక ఇంటర్వ్యూ లో బిగ్ బాస్ గురించి మాట్లాడాడు. "జెన్యూన్ గా ఉండాలా కంటెంట్ కోసం ట్రై చేయాలా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవాళ్లు అంటూ హోస్ట్ అడిగిన ప్రశ్నకు కౌశల్ ఆన్సర్ ఇచ్చాడు. "బిగ్ బాస్ అన్నది మీ రిఫ్లెక్షన్ . వారి గురించి వారు తెలుసుకోవడానికి చాలామంది ఆశ్రమాలకు వెళ్తారు. కానీ బిగ్ బాస్ కి వెళ్తే మీరేంటో మీకు తెలిసిపోతుంది. బిగ్ బాస్ ఒక అద్దం లాంటిది. ఒక మనిషి క్యారెక్టర్ చూపించే సాధనం ఏంటి అంటే అది బిగ్ బాస్. బిగ్ బాస్ లో మనం ఎంత జెన్యూన్ గా ఉన్నా ఎలా ఉన్నా మన క్యారెక్టర్ ఆటోమేటిక్ గా బయటకు వస్తుంది. అదే క్యారెక్టర్ సీజన్ మొత్తం కనిపిస్తుంది. ఆ సీజన్ చూస్తున్న ప్రతీ ఒక్కరికి ఒక్కో రకమైన క్యారెక్టర్ నచ్చుతుంది. కొందరికి అరిసేవాళ్ళు, కొందరికి కరిసేవాళ్ళు, కొందరికి ఎమోషనల్ గా ఉండే వాళ్ళు నచ్చుతారు. అందులో ఎక్కువ క్వాంటిటీ వాళ్ళను ఇష్టపడతారో వాళ్ళే టైటిల్ కొడతారు. " అన్నాడు.
"బిగ్ బాస్ లో ఇదివరకు సెలబ్రిటీస్ ని తీసుకొచ్చారు. అగ్నిపరీక్ష లాంటి కాన్సెప్ట్ పెట్టి కామనర్స్ ని తీసుకొస్తున్నారు అప్పుడు ఏమనింపించింది మీకు. లాస్ట్ సీజన్ స్టార్ట్ అయ్యింది ఈ అగ్నిపరీక్ష" అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు కౌశల్ ఆన్సర్ ఇచ్చాడు. " చూడండి.. బిగ్ బాస్ లో ఎక్స్ పెరిమెంట్స్ అన్ని స్టార్ట్ అయింది మా సీజన్లో నే. ఫస్ట్ కామన్ మాన్ ఇన్ ది తెలుగు బిగ్ బాస్ హౌస్ ఈజ్ గణేష్. ఫస్ట్ అప్పుడు కామన్ మాన్ లందరికీ ఆడిషన్స్ పెట్టి తననే తీసుకొచ్చారు కాకపోతే ఇప్పుడు కామన్ మాన్ లకి అగ్నిపరీక్షను పెట్టి- ఒక ప్లాట్ఫారం ఇస్తున్నారు. అది కూడా టెలికాస్ట్ చేస్తూ ఇప్పుడు ఒకల్ని తీసుకొస్తున్నారు. ఇలా చేస్తూ కొన్ని ఎపిసోడ్స్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. So ఫస్ట్ సీజన్లో కామన్ మాన్ మా సీజన్ కాబట్టి నాకు తెలుసు. అంటే ఏమీ చేసినా, చేయకపోయినా, పడుకుని లేచినా- మీరు పది వారాలు తప్పనిసరిగా ఉంటారు. ఎందుకంటే అంత 100 పర్సెంట్ క్రౌడ్ లో 99 పర్సెంట్ కామనర్స్ ఉంటారు. సెలబ్రిటీస్ వన్ పర్సెంట్ అంతే. అంత చిన్న క్వాంటిటీ సెలబ్రిటీస్ ను ఇంత కామన్ మాన్ అనేసరికి ప్రతీ ఒక్కరూ ఆ కామన్ మ్యాన్ లో వాళ్ళను వాళ్ళు చూసుకుంటారు వాళ్ళను సొంతం అనుకుంటారు మనోడు ఉన్నాడు లోపల అని ఫీలవుతారు. మనోడు మన కామన్ మాన్ మన మధ్యలో నుంచి కష్టపడి లోపలికి వెళ్ళాడు కామన్ మాన్ అందరూ వాడికి సపోర్ట్ చేయాలి అన్న ఆలోచనలో ఉంటారు. " అని చెప్పాడు.





.webp)
